క‌లుపుగోలు త‌నం.. క‌ళా సౌంద‌ర్యం.. శివ‌ప్ర‌సాద్‌ను హిస్ట‌రీ చేశాయి!

-

రాజ‌కీయాలు అంద‌రూ చేస్తారు. కానీ, అంద‌రినీ కొలుపుకొని పోతూ.. అంద‌రిలోనూ ఒక‌రిగా ఉంటూనే అంద రితోనూ క‌లిసి ఉండే నాయ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డంలోను, ఏ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాల‌నే విష‌యంలోనూ దూర దృష్టి.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను సైతం ఎలాం టి వివాదాలు లేకుండా చేసుకోవ‌డంలోను, సొంత నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్టి అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రి ష్క‌రించ‌డంలోను కొంద‌రే ప్ర‌త్యేకంగా నిలుస్తారు. అలాంటి వారిలో కీల‌క‌మైన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. నారిమిల్లి శివ‌ప్ర‌సాద్‌.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు శివ‌ప్ర‌సాద్‌. ఇక్కడే ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ మంచి ఆప్తులుగా ఉన్నారు. శివప్రసాద్ పలు సినిమాల్లో కూడా నటించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే ఆయన సినీ రంగంలోకి ప్రవేశించారు. అనేక సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేశారు. అంతేకాదు.. పలు చిత్రాలకు శివప్రసాద్ దర్శకత్వం వహించారు.

2009కి ముందుగానే స‌త్య‌వేడు నుంచి గెలిచిన ఆయ‌న మంత్రిగా కూడా ప‌నిచేశారు. తాను ఎక్క‌డ నుంచి గెలిచారో.. అక్క‌డ త‌న‌కంటూ .. ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో త‌న‌ముద్ర ఉండేలా చూసుకున్నారు. శివ‌ప్ర‌సాద్‌ను గెలిపించాం.. ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు.. అనే ప్ర‌శ్న తెర‌మీదికి రాకుండా.. తాను ఎక్క‌డ ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తెచ్చేలా టోల్ ఫ్రీ నెంబ‌రును అందుబాటులోకి తెచ్చారు. నిగ‌ర్వి, సౌమ్య‌శీలిగా, అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా ఆయ‌న అంద‌రి బంధువుగా గుర్తింపు పొందారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ, జై చిరంజీవ‌, య‌ముడికి మొగుడు వంటి చిత్రాల్లో శివ‌ప్ర‌సాద్ వేసిన క్యారెక్ట‌ర్ పాత్ర‌లు నేటికీ గుర్తిండిపోతాయి. త‌న‌దైన విల‌క్ష‌ణ శైలితో అంద‌రికీ ఆప్తుడిగా ఉన్న శివ‌ప్ర‌సాద్‌.. తిరిగి రాని లోకాల‌కు చేరిపోవ‌డం నిజంగా రాజ‌కీయాల‌కు, ముఖ్యంగా టీడీపీకి తీర‌ని లోట‌నే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news