రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై..!

-

రాజకీయాల్లో పెను మార్పులు రావాలని… రాజకీయాలను డబ్బుతో ముడిపెట్టకూడదని.. కానీ.. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుతో ముడి పడి ఉన్నాయని ఆ సిస్టమ్ మారాలని తను కోరుకుంటున్నట్లు దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు జేసీ ప్రకటించారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తీవ్ర వేదన చెంది ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి టీడీపీ తరుపున అనంతపురం నుంచి పోటీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా దివాకర్ రెడ్డి తమ్ముడి కొడుకు అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. అయితే.. ఇద్దరూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.

దీంతో దివాకర్ రెడ్డి ఒకింత అసహనంతో పాటు చాలా బాధ పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం పనిచేయడానికి కాస్త సమయం ఇవ్వాలన్న జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ ను ఏనాడూ వ్యక్తిగతంగా దూషించలేదన్నారు.

ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతానన్న జేసీ.. క్రియాశీల రాజకీయాల్లో మాత్రం పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. అయితే.. ఆయన త్వరలో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై మాత్రం దివాకర్ రెడ్డి స్పందించలేదు.

రాజకీయాల్లో పెను మార్పులు రావాలని… రాజకీయాలను డబ్బుతో ముడిపెట్టకూడదని.. కానీ.. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుతో ముడి పడి ఉన్నాయని ఆ సిస్టమ్ మారాలని తను కోరుకుంటున్నట్లు దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news