రేపు ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భాగంగా ఇండియా, సౌతాఫ్రికాలు తలపడనున్న విషయం విదితమే. అయితే రేపే సల్మాన్‌ఖాన్ భారత్ మూవీ రిలీజ్ కూడా ఉంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లకు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ గండి కొట్టే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ప్రతి ఏటా రంజాన్ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినిమా కచ్చితంగా విడుదలవుతుంది. ఈ సారి కూడా రేపు రంజాన్ నేపథ్యంలో ఆయన నటించిన భారత్ మూవీ విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా, కేవలం ఇండియాలోనే 4500 స్క్రీన్లలో భారత్ మూవీని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి భారత్ మూవీతో సల్మాన్ హిట్ కొడతాడని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ అడ్డంకి కానుంది.
రేపు ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భాగంగా ఇండియా, సౌతాఫ్రికాలు తలపడనున్న విషయం విదితమే. అయితే రేపే సల్మాన్‌ఖాన్ భారత్ మూవీ రిలీజ్ కూడా ఉంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లకు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ గండి కొట్టే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. సాధారణ మ్యాచ్‌లు అయితే ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోరు కానీ.. ప్రస్తుతం జరుగుతున్నది వరల్డ్ కప్ కదా. దీంతో అభిమానులు కొంచెం ఎక్కువగానే ఈ టోర్నీ పట్ల ఆసక్తిని చూపిస్తుంటారు. ఇండియా అనే కాదు, ఇతర టీంల మ్యాచ్‌లను కూడా క్రికెట్ అభిమానులు వీక్షిస్తుంటారు.
ఇక వరల్డ్ కప్ కనుక ఇండియా మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య సాధారణం కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చాలా మందైతే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు పెట్టి మరీ మ్యాచ్‌లను చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో అసలు సల్మాన్‌ఖాన్ సినిమాయే కాదు, ఏ ఇతర సినిమానూ క్రికెట్ అభిమానులు వీక్షించే అవకాశం లేదు. అందువల్ల రేపు సల్మాన్‌ఖాన్ భారత్ మూవీకి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. దీంతో సహజంగానే ఈ సినిమా కలెక్షన్లు కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి నిజంగానే భారత్ మూవీ కలెక్షన్లు మొదటి రోజు తక్కువగా ఉంటాయా, ప్రేక్షకులు దేనికి ఓటు వేస్తారు.. సినిమాకా, క్రికెట్ మ్యాచ్‌కా..? అన్న వివరాలు తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు..!