బాబుని తక్కువ అంచనా వేయొద్దు గురు!

-

మరో 30 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారు..అసలు జగన్‌ని ఓడించే సత్తా ఎవరికి లేదని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు మీడియా ముందు చెబుతూ ఉంటారు..మరి వైసీపీ నేతలు చెప్పినట్లు పరిస్తితి ఉందా? అంటే అబ్బే ప్రస్తుతానికి అదేం కనిపించడం లేదని చెప్పొచ్చు..ఎందుకంటే ఏపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి…ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి…ఆ బలం వల్ల జనమంతా తమ వైపే ఉన్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు…అసలు జగన్ పట్ల జనం పాజిటివ్ గా  ఉన్నారని అనుకుంటున్నారు.
కానీ వైసీపీ నేతలు అనుకున్న పరిస్తితులు లేవని చెప్పొచ్చు…గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ బలం చాలా వరకు తగ్గింది..అలాగే టీడీపీ బలం చాలా వరకు పెరిగింది…కాకపోతే కొద్దో గొప్పో వైసీపీనే ఇప్పుడు లీడ్‌లో ఉంది. కానీ ఇదే పరిస్తితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదో చంద్రబాబుని తక్కువ అంచనా వేస్తే చిక్కుల్లో పడక తప్పదని చెప్పొచ్చు.
అసలు చంద్రబాబుని తక్కువ అంచనా మాత్రం వేయకూడదు…ఆయన ఎలాంటి రాజకీయ పరిస్తితులనైనా మార్చేస్తారు. ఇప్పుడు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు…బలం లేదు, స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారని ఎగతాళి చేస్తూ కూర్చుంటే…చంద్రబాబుకు నష్టం జరగదు..వైసీపీకే బొక్క పడుతుంది. ఆయన బలాన్ని తక్కువగా ఊహించుకుంటే ఇబ్బంది…వయసు అయిపోయింది…రాజకీయంగా బలహీనుడు అనుకుంటే పొరపాటు అవుతుంది.
2012 ఉపఎన్నికల్లో అలాగే టీడీపీ దారుణంగా ఓడిపోవడం, వైసీపీ గెలవడం జరిగాయి…కానీ 2014 ఎన్నికలోచ్చేసరికి ఏమైంది…రెండేళ్లలో బాబు మొత్తం మార్చేశారు…మళ్ళీ టీడీపీని అధికారంలో కూర్చోబెట్టారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోవడానికి బాబు తప్పిదాలు చాలా ఉన్నాయి..ఇప్పుడు ఆ తప్పిదాలని సరిచేసుకుంటూ వస్తున్నారు..రోజురోజుకూ బలపడుతున్నారు. ఆ విషయం వైసీపీ గుర్తించాలి…అలా కాకుండా బాబు పని అయిపోయిందని ఎగతాళి చేస్తూ, రిలాక్స్ అయితే వైసీపీకి డ్యామేజ్ జరగడం ఖాయం…కాబట్టి బాబుని తక్కువ అంచనా వేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news