దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలుష్యం తీవ్రత దెబ్బకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వృద్దులు నానా అవస్థలు పడుతున్నారు. చలికాలం వచ్చింది అంటే పొగ మంచుతో కాలుష్యం చుక్కలు చూపిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం నష్ట నివారణా చర్యలకు దిగుతుంది. అక్కడి ప్రజలలో మార్పు తెచ్చే విధంగా వ్యవహరిస్తుంది.
ఇక ఢిల్లీ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు నడపాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలని నిర్ణయం తీసుకుంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజీల్, సీఎన్జీ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల్లో మార్పు రావాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.