ట్రంప్, మెలానియాల లవ్ స్టోరీ.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

-

నేడు, రేపు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అయినప్పటి నుంచి ఆయన షెడ్యూల్ పూర్తి టైట్‌గా ఉండనుంది. నమస్తే ట్రంప్ కార్యక్రమం నుంచి ఆగ్రా తాజ్‌మహల్ సందర్శన వరకు ట్రంప్ బిజీగా గడపనున్నారు. ట్రంప్ వెంట ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్, అల్లుడు కూడా భారత్‌కు వస్తున్నారు. ట్రంప్, మెలానియా ఇండియా వ‌స్తున్న సంద‌ర్భంగా వీరి ల‌వ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అది 1998. అతని వయసు 52 సంవత్సరాలు. ఆమెకు 28 మాత్రమే. ఇద్దరి మధ్యా 24 ఏళ్లు తేడా.

ఓ వ్యాపారవేత్తగా రాణిస్తున్న డొనాల్డ్ ట్రంప్, అప్పటికే రెండో వివాహం చేసుకుని, ఆమెను కూడా వదిలేసి విడిగా ఉంటున్నారు. ఆమె స్లొవేనియాకు చెందిన మోడల్ మెలానియా. న్యూయార్క్ లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ కు వచ్చారు. ఆ సమయంలో ఆమెను చూసిన వెంటనే ట్రంప్ మనసు పారేసుకున్నారు. అప్ప‌టి నుంచీ ట్రంప్ ఆమెను వదల్లేదు. మెలానియా ఎక్కడికి వెళితే, అక్కడికి వెళ్లేవారు. మొదట్లో అతని ప్రేమకు ఓకే చెప్పిన మెలానియా తర్వాత మళ్లీ కాదంది. మళ్లీ ఓకే చెప్పింది. తొలిసారిగా హోవార్డ్ స్టెర్న్ టీవీ షోలో వీరి మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది.

2005లో తమ మధ్య ఉన్న సంబంధాన్ని ట్రంప్ స్వయంగా బయటపెట్టారు. అప్పటికే తమ ఎంగేజ్ మెంట్ జరిగిందన్నారు. ఇక వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం ఆమెకు యూఎస్ పౌరసత్వం కూడా లభించింది. 2006లో మెలానియాకు కుమారుడు జన్మించాడు. మెలానియా బహుభాషా కోవిదురాలు. స్లొవేనియా, ఫ్రెంచ్, సెర్బియా, ఇంగ్లీష్, జర్మన్ భాషల్లో మాట్లాడతారు. భర్తకు అన్నింటా చేదోడు వాదోడుగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news