సోమవారం రాష్ట్రంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చారు. అయితే, దీనికి ఏపీలో రాజకీయ పరిణామాలకు మధ్య లింకేంటని ఆ శ్చర్యం వ్యక్తం చేయడం సహజం. కానీ, ఏపీ రాజకీయాలపై ట్రంప్ ఎఫెక్ట్ బాగానే పడిందని అంటున్నా రు పరిశీలకులు. మొత్తం రెండు కీలక పరిణామాలు సోమవారం టీడీపీ నిర్దేశించుకుంది. అయితే, ట్రంప్ ప్ర భావంతో ఈ కార్యక్రమాలపై త్రీవ ఎఫెక్ట్ పడింది. నిజానికి ఢిల్లీకి వచ్చే ట్రంప్ కారణంగా తమ కార్యక్రమాల కు ఎలాంటి ఇబ్బందీ ఉండదని మొదట్లో చంద్రబాబు , ఆయన బృందం భావించారు.
ఈ క్రమంలోనే రెండు ముఖ్యమైన కార్యక్రమాలను నిర్దేశించుకున్నారు. ఇవి రెండూ కూడా చాలా కీలకమై నవి కావడంతో వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు, ఆయన బృందం. ఈ రెండు కార్యక్రమాలను విజయం వంతం చేయాలని అనుకున్నారు. అయితే, ఎంత మంది నాయకులు పాల్గొన్నా కూడా మీడియా దన్నులేక పోతే.. లైవ్ టెలికాస్టులు లేకపోతే.. ఏం ప్రయోజనం… అందుకే టీడీపీ అనుకూ ల మీడియాలన్నీ యధాప్రకారం లైవ్ టెలికాస్టులు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి వారు కూడా సరే అన్నారు. దీంతో రెండు కార్యక్రమాలకు రెడీ అయ్యారు.
వీటిలో కీలకమైంది.. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర. గత శుక్రవారం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు రోజులు విరామం ఇచ్చిన చంద్రబాబు తాజాగా సోమవారం తన నియోజకర్గం కుప్పంలో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనిని రెండు రోజులు కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వంపై మరోసారి దుమ్మెత్తిపోయాలని నిర్ణయించుకున్నారు. ఇక, రెండో కార్యక్రమం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నక్యాంటీన్ల ముందు ధర్నా, నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.
దీనికి పార్టీ నాయకులు రెడీ అయ్యారు. అయితే, ట్రంప్ ఇండి యా పర్యటన నేపథ్యంలో టీడీపీ అనుకూల మీడియాలన్నీ ఆయన పర్యటనను లైవ్ టెలికాస్ట్ చేయడంతో చంద్రబాబు ఊహించినట్టు ఈ రెండు కార్యక్రమాలూ మరుగున పడ్డాయి. వీటికి లైవ్ టెలికాస్ట్ లేకుండా పోవడం గమనార్హం. మొత్తానికి ట్రంప్ వచ్చాడనే ఆనందం ఉన్నా.. మరోపక్క, తమ కార్యక్రమాలు మరుగున పడ్డాయనే బాధ టీడీపీని వేధిస్తుండడం గమనార్హం.