జగన్ పెట్టిన రూల్స్ బ్రేక్ చేస్తే ఇంకేం లేదు ..!!

-

కరోనా వైరస్ ప్రపంచంలో అగ్రదేశాలు అని చెప్పుకునే దేశాలను గజగజ వణికే పోయేలా మొత్తం పరిస్థితులను మార్చేసింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఆ దేశంలో చాలా మందిని బలి తీసుకునే ప్రస్తుతం యూరప్ మరియు అమెరికా అదేవిధంగా స్పెయిన్ దేశాలలో మనుషులను చాలా మందిని బలితీసుకుంది. ఇటలీ దేశం అయితే ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. ముఖ్యంగా ఈ విధంగా ఇటలీ దేశం అవ్వటానికి కారణం ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు మరియు ఆదేశాలు ఇచ్చినా గాని ప్రజలు పాటించకపోవడం అని..చివరిలో కొంతమంది మిగిలిన ఇటలీ ప్రజలు సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచానికి మొత్తుకున్నారు.YS Jaganmohan Reddy restarts works at Amaravati - The Economic Timesదయచేసి మీ గవర్నమెంట్ చెప్పే రూల్స్ పాటించండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి…మీరు బయటికి వెళ్లకుండా మీ కుటుంబ సభ్యులు స్మశానానికి వెళ్లకుండా మీ అడుగు బయట వేయకండి అంటూ వీడియో రూపంలో మెసేజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్న కొద్ది వైరస్ ప్రభావం పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ రాష్ట్రంలో కొత్త వారు ఎవరు రావద్దని…మన రాష్ట్రానికి చెందిన వాళ్లు అయినా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండండి…ఇరవై ఒక్క రోజు ల లాక్ డౌన్ తరువాత పరిస్థితి మారుతుంది ప్రభుత్వమే తీసుకొస్తుందని దండం పెట్టి మరి మీడియా సాక్షిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలావరకు ఏపీ సరిహద్దుల దగ్గర పోలీసులను పెట్టి అంత క్లోజ్ చేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది జగన్ పెట్టిన రూల్స్ బ్రేక్ చేస్తూ అడ్డదారుల్లో రాష్ట్రంలో కి రావటానికి ట్రై చేస్తున్నారు…అంతేకాకుండా కొంతమంది ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు గుంపులు గుంపులు గా ఉన్న చోట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వ్యవహరిస్తున్నారు. ఇదే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులు జరిగితే కనుక…భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా సోకే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల జీవితాలతో మీ కుటుంబ సభ్యుల జీవితాలతో ఆడుకోవద్దని సీఎం జగన్ పెట్టిన రూల్స్ బ్రేక్ చేయకుండా ఇంటికే పరిమితం కావాలని తెలియజేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news