ఎన్నో మలుపుల తర్వాత ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్‌పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన్ను బర్తరఫ్ చేసిన తర్వాత వరుసగా కాంగ్రెస్, బీజేపీ నేతలను కలిశారు. దీంతో అసలు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఫైనల్‌గా ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయం అయింది.
ఇప్పటికే ఆయన ఢిల్లీ కూడా వెళ్లి జేపీ నడ్డాతో చర్చించారు. అయితే ఈటల రాకపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల వారంలోగా బీజేపీలో చేరతారని, ఆయనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
ఇక ఈటల ఎలాంటి హామీ లేకుండానే పార్టీలో చేరుతున్నారంటూ బండిసంజయ్ స్పష్టం చేశారు. బీజేపీలో ఎలాంటి హామీలు ఉండవని, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి అందరూ పనిచేస్తారంటూ వెల్లడించారు. ఇక రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని వివరించారు.