ఈట‌ల రాజేంద‌ర్ ర్యాలీపై ర‌గ‌డ‌.. చెప్పేవారే ఇలా చేస్తే ఎలా!

-

క‌రోనా రాష్ట్రంలో ఏ స్థాయిలో విరుచుకుప‌డుతుందో చూస్తూనే ఉన్నాం. ఓ వైపు హాస్పిట‌ళ్ల‌లో బెడ్లు దొర‌క్క‌, ఆక్సిజ‌న్ అంద‌క రోగులు చ‌నిపోతూనే ఉన్నారు. ఇంత‌టి ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు గుమిగూడ‌వ‌ద్దు, పెళ్లిల్లు, ఫంక్ష‌న్లు జ‌ర‌పుకోవ‌ద్దంటూ చెప్పిన హెల్త్ మినిస్ట‌ర్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారారు. అదెలా అంటే ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేయాల్సిన ఈట‌ల రాజేంద‌ర్ ఆదివారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తాను సోమ‌వారం వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తున్నాన‌ని.. ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని కోరారు.


ఇక ఈ ప్ర‌క‌ట‌న‌పై డాక్ట‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా లెక్క‌ల‌పై, ఆస్ప‌త్రుల్లో వ‌స‌తుల‌పై త‌ప్పుడు లెక్క‌లు చెబుతున్నా.. తాము మౌనంగా ఉండి… ప్రాణాల‌ను పణంగా పెట్టి సేవ‌లు చేస్తుంటే.. ఇప్పుడు స్వ‌యానా ఆరోగ్య‌శాఖ మంత్రే కేసులు పెర‌గ‌డానికి కార‌ణం అవుతున్నారంటూ మండి ప‌డుతున్నారు. తాము ఎన్నిక‌లు వ‌ద్ద‌ని ఎన్నిసార్లు చెబుతున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
ఇక ఈ విష‌యం ఈట‌ల రాజేంద‌ర్ దృష్టికి కూడా వెళ్లిందంట‌. అయితే దీనిపై హెల్త్ మినిస్ట‌ర్ ఎలాంటి ప్ర‌క‌ట‌న గానీ, వివ‌ర‌ణ గానీ ఇచ్చుకోలేదు. అయితే తాను క‌రోనాపై అల‌ర్ట్ గానే ఉన్నాన‌ని, అందుకోసం ఎవ‌రితోనైనా క‌లిసి ప‌నిచేసేందుకు రెడీగా ఉన్నాన‌ని చెప్పేందుకు క‌రీంన‌గ‌ర్ లో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తో క‌లిసి రివ్యూమీటింగ్ పెట్టారు. ఇంత వ‌ర‌క వీరెవ్వ‌రూ క‌లిసి మీటింగ్ పెట్ట‌లేదు. కానీ ఈ మీటింగ్ తో తాము ప‌నిచేస్తున్నామ‌ని మంత్ర‌లు మెసేజ్ ఇచ్చారంటూ అంతా అనుకుంటున్నారు. చూడాలి మ‌రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌ళ్లీ ప్ర‌చారానికి వెళ్తారా లేదా అనేది.

Read more RELATED
Recommended to you

Latest news