ఈట‌ల వ‌ర్సెస్ హ‌రీశ్‌రావు.. కేసీఆర్ ప్లాన్ స‌క్సెస్ అయిన‌ట్టుందే!

ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో మొద‌టి నుంచి కేసీఆర్ చాలా ప‌క్కాగా ముందుకెళ్తున్నారు. ఈట‌ల‌పై ఎవ‌రిని ప‌డితే వారిని మాట్లాడ‌నివ్వ‌కుండా కేవ‌లం కొంద‌రికే ఆ బాధ్య‌త ఇస్తున్నారు. ఇక ఈట‌ల‌కు పార్టీలో ఉన్న స‌న్నిహితుల‌తోనే వైరం పెడుతున్నారు. అందులో భాగంగానే హ‌రీశ్‌రావును రంగంలోకి దింపారు గులాబీ బాస్‌. ఈట‌ల‌కు ఎవ‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా చూసేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు కేసీఆర్‌.

ఇక ఎప్ప‌టికైనా ఈట‌ల రాజేంద‌ర్‌ కు అత్యంత స‌న్నిహితుడైన హ‌రీశ్‌రావు మ‌ద్దతుగా నిల‌బ‌డే ఛాన్స్ ఉంద‌ని ప‌సిగ‌ట్టారు కేసీఆర్‌. అందుకే హుజూరాబాద్ రాజ‌కీయాల్లో ఈట‌ల‌కు ఆయ‌న్నే ప్ర‌త్య‌ర్థిగా ఉంచి మ‌రీ ఇద్ద‌రి మ‌ధ్య వైరం పెంచుతున్నారు. ఈ కార‌ణంగా ఇప్పుడు హుజూరాబాద్ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి.

ఇప్పుడున్న హుజూరాబాద్ రాజ‌కీయ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే కేసీఆర్ ప్లాన్ బాగానే స‌క్సెస్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్సెస్ హ‌రీశ్‌రావు అన్న‌ట్టు ప‌రిస్థితులు మారాయి. ఈట‌ల రాజేంద‌ర్ ద‌మ్ముంటే త‌న‌మీద గెల‌వాల‌ని హ‌రీశ్‌రావుకు డైరెక్టుగానే చాలెంజ్ చేస్తున్నారు. హ‌రీశ్‌రావుపై ఎన్నో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అటు ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావు కూడా ఈట‌ల గ‌ట్టిగానే కౌంట‌ర్ వేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్లాన్ బాగానే ప‌నిచేసింది.