మంత్రులపై ఈటల షాకింగ్ కామెంట్స్.. బంట్రోతుల్లా మారారు !

మాజీ మంత్రి, బిజేపి నేత ఈటెల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో మంత్రులు బంట్రోతుల్లా మారారని… రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మంత్రులతో డప్పు చాటింపు చేయించి నట్లు ఉందని చురకలు అంటించారు. దళితుల ఓట్లు కొల్ల గొట్టడానికి కేసీఆర్ దళిత బంధు పెట్టాడని మండిపడ్డారు. అంటరాని తనం లేని దేశం కావాలని ఆంబెడ్కర్ కోరుకున్నాడని.. మరి కేసీఆర్ ఏ జాతిని ఉద్దరించావో చెప్పాలని ఫైర్ అయ్యారు.

ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తే నిధులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు ఇస్తున్నారన్నారు. ”మా నియోజక అభివృద్ది కోసం నేను కూడా రాజీనామా చేస్తా, 2వేల కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అడిగారు.” అని గుర్తు చేశారు. ఏ శాఖలో పైసలు లేవని… తాతల కాలంలో హైద్రాబాద్ లో కొనుగోలు చేసిన భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నాడని ఆరోపణలు చేశారు.

ఈటెల రాజేందర్ కు కులం, మతం ఉండదు. నా ఇంటికి వేల మంది వస్తుంటారన్నారు. ఎవరు ఇంటికి వచ్చిన అన్నం పెడతానని చెప్పారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని..గెలిస్తే పాలన అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు. తన అనుభవం క్రోడీకరించి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసుకుందామన్నారు.