కవిత రెండు ఓట్ల వివాదం : క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్

-

ఎమ్మెల్సీ కవితకు రెండు చోట్ల ఓటు హక్కు ఉందని ఆమె మొన్న జరిగిన నిజామాబాద్ ఎన్నికల్లో అలానే నిన్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని అందుకే ఆమెని ఎమ్మెల్సీ పదవికి అనర్హురాలుగా ప్రకటించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ.

ఇక ఈ అంశం మీద బండి సంజుయ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని సీఈసీ కి లేఖ రాశామని కవిత రెండు ఓట్లు వినియోగంపై సీఈసీ స్పందిస్తోందని ఆశిస్తున్నామని అన్నారు. ఒక వ్యక్తి రెండు  ఓట్లు వేయొచ్చా? అని అయన ప్రశ్నించారు. అయితే ఈ వివాదం మీద ఎన్నికల సంఘం స్పందించింది.  గతేడాది నిజామాబాద్ లో ఓటు వేసి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఓటు వేశారని బీజేపీ ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ వివరణ ఇచ్చింది. కవిత నిజామాబాద్ లో ఓటు హక్కు రద్దు చేసుకున్నారని ఎస్ఈసీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news