ఏంటిది బాబూ…?? మీడియా ముందు 15వేలు, ఆఫీస్‌లో 300??

420

చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమీషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోన్నున్నాయి. ఎలక్షన్‌ ముందు రోజు, ఎలక్షన్స్‌ జరుగుతున్న రోజు, ఎలక్షన్స్‌ అయిపోయిన తరువాత చంద్రబాబు చేసిన ఆరోపణలు ఒక్కదానికి మరోటి పొంతన లేకుండా ఉన్నాయి.. ఎన్నిలక సంఘం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. నేరుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని బెదిరించడం, ఎన్నికల కమీషన్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎప్రిల్‌ 10న ఆఫీస్‌కి వచ్చి చంద్రబాబు ఏమని బెదిరించాడో, ఎన్నికల కమీషన్‌ గురించి ఏమని అన్నాడో వివరంగా అనువదించి పంపమని ద్వివేదిని ఆదేశించినట్టు సమాచారం. దాంతోపాటు సంఘటన వీడియో కూడా జతచేయాలని కోరిందట.

చంద్రబాబు ఎన్నికల కమీషన్‌పై ఆరోపణలు చేసిన వ్యాఖ్యలు 30 శాతం ఈవీఎంలు పనిచేయట్లేదు.. అంటే 30 శాతం అంటే చంద్రబాబు లెక్క ప్రకారం సుమారు 15వేల ఈవీఎంలు పనిచేయలేదన్నమాట..! తరువాత రోజు టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల కమీషన్‌లో సుమారు 300 ఈవీఎంలు పనిచేయట్లేదని ఫిర్యాదు చేశారు.
అంటే మీడియా ముందు 15 వేలు అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నది ఎన్నికల కమీషన్‌ ఆరోపణ..