నిమ్మగడ్డ లేఖలో నిగ్గు తేలాల్సిన అంశాలు ఇవేనట! 

-

దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో దాదాపుగా కరోనా గురించిన వేడి వాతావరణం మాత్రమే నడుస్తుంటే… ఏపీలో మాత్రం కరోనాతో పోటీగా రాజకీయ వాతావారణం వేడెక్కుతుంది. మాజీ ఎస్.ఇ.సి. నిమ్మగడ్డ రమేశ్ ను తప్పించడంతో మొదలైన ఈ  వ్యవహారం… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ వ్యవహారంతో మరింత  హీటెక్కుతుంది.  ఈ వ్యవహారంపై తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు విజయసాయిరెడ్డి.కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది తానేనంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించడంతో మరోసారి ఏపీలో రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా మరింత తీవ్రంగా స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా “నిమ్మగడ్డ లేఖలో నిగ్గు తేలాల్సిన మూడు అంశాలు” ఉన్నాయి అని మొదలుపెట్టిన సాయిరెడ్డి… నిమ్మగడ్డ పేరుతో ఆలేఖపై సంతకం చేసింది ఎవరు? ఆ లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు, ఎప్పుడు డ్రాఫ్ట్ చేశారు . అన్న వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలు అన్నీ బైటకు వస్తాయి అంటూ ముగించారు! ఇదే క్రమంలో.. కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా  హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు ఆ లేఖపై పోలీసు దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు పట్టినట్లున్నాయి.

నెల తర్వాత నోరు విప్పి లేఖ రాసింది తానే అంటున్నారు. దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో ఇప్పటికి బోధపడినట్లుంది అంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయి! దీంతో… ఏపీలో కరోనా ఒకవైపు విజృంబిస్తూ తనపని తాను చేసుకుంటూ పోతుంటే… మరో పక్క ప్రభుత్వం రోజు రోజుకీ కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకుపోతుంటే… మరోపక్క ఈ మాజీ ఎన్నికల కమిషన్ వ్యవహారం మాత్రం రోజు రోజుకీ ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తుందనే చెప్పాలి!! ఈ వ్యవహారం తిరిగి తిరిగి ఎక్కడ ఆగుతుందో!! అయితే… విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు ఈ వ్యవహారంలో దాక్కున్న కలుగులో ఎలుకలు ఎవరనేది మాత్రం ముందు ముందు
తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news