ఫ్యామిలీ పాలిటిక్స్: ఇంత వరెస్ట్‌గా ఉన్నారా?

-

ఏపీలో రాజకీయ విలువలు బాగా దిగజారిపోయాయి..అధికారంలోకి రావడానికి ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపీలు దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయం అంటే వారికి వారే తేల్చుకోవాలి. అధికార పార్టీ చేసే తప్పులని ప్రతిపక్ష పార్టీ ఎత్తిచూపాలి. అలాగే ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ కౌంటర్ ఇవ్వాలి. అయితే ఇలా జరగాల్సిన రాజకీయం మరీ వ్యక్తిగతంగా వెళ్లిపోతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని గాని, కొందరు వైసీపీ నేతలని పర్సనల్‌గా టార్గెట్ చేశారు. కాకపోతే అప్పుడు దారుణమైన రాజకీయం తక్కువ.

కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయం మరింత దారుణంగా మారింది..ప్రతిపక్ష చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మరింత పెరిగింది. ఎవరైనా జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే..వారిని వ్యక్తిగ్తంగా తిట్టడం వైసీపీ నేతల పని అయిపోయింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌..ఇలా ప్రతిపక్ష నేతలు ఎవరైనా సరే..వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టేస్తున్నారు. ఇక వైసీపీకి కౌంటర్లు ఇచ్చే క్రమంలో టీడీపీ నేతలు కూడా అదే బూతులతో సమాధానం చెబుతున్నారు.

సరే వారు వారు తిట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు..కానీ ఫ్యామిలీలని కూడా లాగి తిడుతున్నారు. మొదట చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. అలాగే నారా, నందమూరి ఫ్యామిలీల్లోని ఆడవాళ్లని వైసీపీ టార్గెట్ చేసింది. ఇటు టీడీపీ కూడా వైఎస్ భారతిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది..అలాగే జగన్ పిల్లలని కూడా వదలడం లేదు. వైఎస్ ఫ్యామిలీని గట్టిగా టార్గెట్ చేస్తుంది. ఇలా ఏపీలో రాజకీయాలు వరెస్ట్‌గా నడుస్తున్నాయి.

ఇక తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు చంద్రబాబు వచ్చారు..ఎన్టీఆర్ వెన్నుపోటుకు క్లారిటీ ఇచ్చారు. 1995లో ఏం జరిగిందో చెప్పారు. కానీ ఈ అంశంపై వైసీపీ..బాబుని ఇంకా టార్గెట్ చేస్తుంది. ఎన్టీఆర్ చావుకు కారణం బాబు అనే విమర్శిస్తుంది. ఇక వీరికి కౌంటరుగా వైఎస్సార్‌కు జగన్ వెన్నుపోటు ఎన్నిసార్లు పొడిచారో తెలుసని, జగన్‌ని బెంగళూరులో ఎందుకు పెట్టారో తెలుసని, ఇక జగన్ బాబాయ్ వివేకా హత్య గురించి పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు. తల్లికి, చెల్లెళ్ళుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అంటూ టీడీపీ విమర్శిస్తుంది. ఇలా రెండు పార్టీలు ఫ్యామిలీలని లాగి వరెస్ట్ రాజకీయం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news