గురువారం నాడు తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా తన టీమ్‌తో కలిసి మంచు విష్ణు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్కు మంచు మోహన్ బాబు కూడా హాజరు అయ్యారు.ఈ సమావేశంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యలపై టాలీవుడ్ వర్గాల్లో బిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విష్ణు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మీడియాకు ఎక్కినా, ధర్నాలు చేసినా ఆ సభ్యుల సౌకర్యాలు కట్ చేస్తామని .. కమిటీ నిర్ణయం తీసుకుంటే సభ్యత్వమే పోతుందని మంచు విష్ణు హెచ్చరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక కుటుంబమని.. ఈ కుటుంబంలో తమ మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా మేమే కూర్చోని పరిష్కరించుకుంటామని , అలా కాకుండా బయటకు వెళ్లి అల్లరి చేస్తే బయటకు నెట్టి వేస్తామని విష్ణు వార్నింగ్ ఇచ్చాడు.
అలాగే, సినీ పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులు వస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు మాత్రమే రావాలని అన్నారు. అలా కాకుండా మీడియాకు ఎక్కి రచ్చరచ్చ చేస్తే మా కమిటీ అస్సలు పట్టించకోదు అని విష్ణు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు అన్ని తమ చట్టంలో చేర్చామని, లైఫ్ మెంబర్‌గా ఐదేళ్లు పూర్తిచేసుకున్న సభ్యులు మాత్రమే ‘మా’ ఎన్నికల్లో నిలబడే వీలుందని విష్ణు తెలిపారు. దీనితో నరేష్ కు , ప్రకాష్ రాజ్ కు చెక్ పెట్టినట్లే అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే సభ్యత్వం లేదు, అలాగే నరేష్ ఎప్పుడూ మీడియాలో మాట్లాడుతూ వుంటారని , దీనితో ఇద్దరి పని క్లోజ్ అని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.