కేంద్రం మెడలు వంచిన రైతులు..చట్టాలు రద్దయ్యే వరకూ పోరాటం.

ప్రజా పోరాటాల ముందు ఎంత పెద్ద ప్రభుత్వాలైన, నేతలైన ప్రజా బలం ముందు ఓడిపోక తప్పదు..చరిత్రలో చాలా మంది నియంతలు ప్రజల తిరుగుబాటుతో కాలగర్భంలో కలిసిపోయారు..ప్రజా వ్యతిరేఖ విధానాలు అమలు చేసిన ప్రభుత్వాలు గతంలో ఎక్కువ కాలం అధికారంలో ఎన్నట్లు లేదు..రైతు ఏడ్చిన రాజ్యం..ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని పెద్దలు పెంచిన మాట..ఇది ఇప్పుడు అక్షరాల నిజంగా కనిపిస్తుంది..కేంద్రంలో భారీ మెజార్టీతో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..అనేక కొత్త అవిష్కరణలు,కొత్త పథకాలను ప్రారంభించింది..అనేక సంస్కరణలు చేపట్టుతుంది..దాంతో పాటు అనేక ప్రజా వ్యతిరేఖ విధానాలు, రైతు వ్యతిరేఖ సంస్కరణలు, చట్టాలనూ కూడా తీసుకువస్తుంది..ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళనలో ఉన్నారు..రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు..మరి ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లోని రైతులు గత నెల రోజుల నుంచి ఆందోళ చేస్తున్నారు..కేంద్రం తీసుకొచ్చిన నూతనసాగు చట్టాలను ఉపసంహరించాలన్న డిమాండ్‌తో.. నేడు ఢిల్లీలో వేలాది మంది రైతులు ఆందోళన చేయనున్నారు. చీకటి చట్టాలను ఉపసంహరించేంత వరకూ ఢిల్లీ వదిలి వెళ్లేది లేదంటున్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు గ్రామాల నుంచి బయలుదేరి ఢిల్లీ బాటపట్టారు..కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ ఢిల్లీలోనే ధర్నా చేస్తామని..అందుకు కావల్సిన సరకులను కూడా వెంటబెట్టుకుని దేశ రాజధానికి బయలుదేరారు..రైతులకు ఢిల్లీకి రాకుండా పంజాబ్‌,హర్యానా సరిహద్దులో అడ్డుకునే ప్రయత్నం చేశారు..వాటర్ కెనాన్లు, లాఠీ దెబ్బలు, టియర్‌గ్యాస్‌,,రోడ్ అడ్డంగా గుంతలు, రాళ్లు అడ్డుపెట్టి రైతులను అడ్డుకున్నారు..రైతుల మనోబలం ముందు అవన్నీ తలొంచాయి..పట్టు వదలని విక్రమార్క్‌నిగా కర్షకులు ముందుకు సాగారు..పోలీసులతో ఢీ అంటే ఢీ అన్నట్లు కొట్లాడారు..కొన్ని సందర్భంలో పోలీసులను కూడా కన్విన్స్ చేసి, మీరుకూడా రైతుకుటుంబం నుంచి వచ్చిన వారే అని.. తమతో రావాలని విజ్ఞప్తి చేశారు..రైతులు ఢిల్లీ చేరకుండా ఎన్ని అవంతరాలు సృష్టించిన వెనుకడుగు వెయ్యలేదు రైతులు.

రైతుల పోరాటంపై దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది..దేవ వ్యాప్తంగా రైతులకు మద్దతు పెరిగింది.  ఇతర రాష్ట్రాల రైతులు వారికి సంఘీభావం తెలిపి,మద్దతుగా నిలిచారు..సాక్షాత్తు బీజేపీ పార్టీ రైతు అనుబంధ సంఘం కూడా మద్దతు ఇవ్వడంతో.. రైతులు ఆందోళన తీవ్రతను గ్రహించిన కేంద్రం..పరిస్థితి చేయిజారీపోతుందన్న నిర్ణయానికి వచ్చి రైతుల చలో ఢిల్లీకి అనుమతి ఇచ్చింది..వచ్చే నెల మూడవ తేదిన రైతు సంఘాలతో కేంద్ర వ్యవసాయ మంత్రి చర్చలు జరపనున్నారు..అప్పటి వరకూ ఢిల్లీలోనే రైతుల ధర్నాకు అనుమతి ఇచ్చారు..దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి బయలుదేరి వెలుతున్నారు..కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామంటున్నారు.ఇది రైతులు సాధించిన విజయంగా విశ్లేషకులు అంచన వేస్తున్నారు..గత ఆరు సంత్సరాలలో కేంద్రం ఎప్పుడు తను తీసుకున్న నిర్ణయాలు ఎంత విమర్శకులకు దారితీసిన వాటిపై వెనక్కి తగ్గలేదు..కాని రైతులు చేసిన పోరాటాకి కేంద్రం తలోగ్గిందంటున్నారు రాజకీయ వేత్తలు..ఇది రైతులు కేంద్రం మెడలు వచ్చి సాధించుకున్న గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నారు..రైతులు తీసుకువచ్చిన ఈ మార్పు భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలకు బాటలు వేస్తుందంటున్నారు..

రైతులు చూపిస్తున్న పోరాట పటిమ, ఉద్యమ స్పూర్తితో బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్ఐసీ ఇతర ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలను కుంటున్ననేపథ్యంలో ఉద్యోగులు రైతుల ఆందళోన స్ఫూర్తితో నిరసనలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. నిరుద్యోగులపై కూడా రైతుల ఉద్యమ ప్రభావం ఉంటుందంటున్నారు..మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నా రైతు వ్యతిరేఖ విధానాలకు పంజాబ్‌ రైతుల ఆందోళన నిదర్శనం అని విమర్శిస్తున్నారు..ఇది రైతుల ఉద్యమం అని తప్పకుండా విజయం సాధిస్తారని..వారికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని ప్రకటిస్తున్నారు..