గోదావ‌రి- పెన్నా అనుసంధానానికి శంకుస్థాప‌న‌

-

తెలుగుజాతికోస‌మే శ‌త్రువుతో చేతులు క‌లిపా- సీఎం చంద్ర‌బాబు

గుంటూరు: గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్రీకారం చుట్టారు. తొలి దశ పనులకు నకరికల్లు వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. పేరేచర్ల-కొండమోడు రోడ్డు విస్తరణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సత్తెనపల్లి, రాజుపాలెం బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణాలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదలిపెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుజాతి కోసం శ‌త్రువుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. మోదీ నోట్లు రద్దు చేసి దేశాన్ని భ్రష్టుపట్టించారని, కేంద్రం ప్రభుత్వానికి అసహనం పెరిగిందని చంద్రబాబు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version