విద్యార్థులకు జగన్ శుభవార్త…ప్రతి నియోజక వర్గానికి ఐటీఐ కాలేజీలు

అమరావతి : ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ఐటీఐ కాలేజ్ తీసుకు వస్తామని సీఎం జగన్ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని.. తిరుపతి లో స్కిల్‌ యూనివర్శిటీ తీసుకు వస్తామన్నారు.

jagan
jagan

కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో స్కిల్ కాలేజీల్లో బోధన, శిక్షణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ లకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ మరియు తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలని ఆదేశాలు జరరీ చేశారు. టెన్త్‌ డ్రాప్‌ అవుట్‌ అయిన యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం పై దృష్టి పెట్టాలన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.  నైపుణ్యం లేని మానవవనరుల వల్ల కొన్నిచోట్ల మురుగు నీరు శుద్ధిచేసే ప్లాంట్లు సరిగ్గా నడవడం లేదన్నారు.