హరీష్ రావు ఓ రబ్బరు స్టాంపు : ఈటల

హుజురాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంత్రి హరీష్ రావు ఓ రబ్బర్ స్టాంప్ అని మండి పడ్డారు.. నేను సీఎం కావాలని అనుకున్నానా..? గుండె మీద చెయ్యి వేసి చెప్పు హరీష్ రావు ? అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అడుగులకు మడుగులు ఒత్తితే నే ప్రగతి భవన్ కు ఎంట్రీ అని పేర్కొన్నారు.

తాను రాజీనామా చేయలేదని.. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చెయ్యిమంటేనే చేశానని ఫైర్ అయ్యారు. మంత్రి హరీష్ రావు లాగా వారసత్వం తో రాజకీయాల్లోకి రాలేదని .. హరీష్ కు ఆయన మామ ఉన్నాడని చురకలు అంటించారు. హుజురాబాద్ ఎన్నిక రిహార్సల్ మాత్రమేనని.. తన గెలుపును ఎవరూ అపలేరని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. తన ను ఓడించేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని.. అవేం పని చేయబోవన్నారు ఈటల రాజేందర్.