తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు .. ప్రభుత్వం సీరియస్

-

మనకు నచ్చని వ్యక్తి ఒక హోదాలో ఉంటే ఎక్కడిలేని అక్కసునంతా వెళ్లగక్కుతాం. నేటి సమాజంలో ఇది సాధారణంగా మనం గమనించేదే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇది వాస్తవం అనిపిస్తుంది. మరో పార్టీ అధికారంలో ఉంటే అదేంటో గానీ జరిగేవన్నీ ఘోరాలుగా అన్యాయాలుగా కనిపిస్తాయి చంద్రబాబుకి. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ విషయంలో చంద్రబాబు ధోరణి అవలంబిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రామరాజ్యం ఏర్పాటు చేశామని చెప్తున్న చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని రావణరాజ్యంగా పేర్కొంటున్నారు. దేశంలో ఎక్కడ లేని కష్టనష్టాలన్నీ ఏపీలోనే ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు కొన్ని కథనాలు కూడా ఆ కోవలోనే వండి వారుస్తున్నారు.

లోకంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించి సొంత పైత్యాన్ని జోడించి కథనాలు వండటంలో చంద్రబాబు దిట్ట అనేది మరోసారి ఋజువైంది. అదే జోరులో కావాలని వార్తలు రాయించి జనంలోకి వదులుతున్నారు. ఆ క్రమంలో నిన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు కావాలని ఒక సంఘటనను అక్కడికక్కడే ప్లాన్ చేసి అది నిజం అనేలా వార్తగా రూపొందించి జనంలోకి వదిలారు. పైన గొడుగు – కింద మడుగు అంటూ ఈనాడు, నమ్మండి – ఇది నిజంగా బడే అంటూ ఆంధ్రజ్యోతి ఓ సొంత కవిత్వాన్ని పబ్లిక్‌లోకి వదిలారు. వాళ్ళను అలా వదిలితే బాగోదు కదాని ఇప్పుడు ప్రభుత్వం ఆ సంస్థలు, వార్తలు రాసిన విలేకరుల మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తోంది. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారి విస్సన్నపేట మండల విద్యాధికారికి ఉత్తర్వులు ఇస్తూ ఆయా వార్తా సంస్థల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

విస్సన్నపేట జడ్పి హైస్కులును రూ. 66 లక్షలతో నాడు – నేడు పథకంలో ఆధునీకరించారు. కొత్త బెంచీలు, పచ్చదనం, శుభ్రమైన టాయిలెట్లు…. స్కూల్ చూస్తే ముచ్చటపడేలా ఉంది. అయితే ఆ పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పట్లో నిర్మించి శిథిలావస్థకు చేరిన అస్బెస్టాస్ రేకుల భవనాలు వినియోగించకుండా వదిలేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రేకుల భవనాల్లోకి నీరు చేరింది. అయితే సదరు ఇద్దరు విలేకరులు కలిసి పాఠశాల ప్రారంభానికి ముందే బడి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఆడుకుంటున్న పిల్లలను ఆ శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి, బలవంతాన కూర్చోబెట్టి ఫోటోలు, వీడియోలు తీయించారు. ఈ విషయం అధికారుల విచారణలో బట్టబయలైంది.

అంటే అక్కడ సమస్య ఏమీ లేకున్నా ఉన్నది లేనట్లు చిత్రీకరించి వార్తను రూపొందించి జనంలోకి వదిలారు. వాస్తవానికి భిన్నంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే విధంగా ప్రచురించిన ఆ వార్తల విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు అక్కడ విచారణ జరిపి, ఆ తప్పుడు కథనాలకు బాధ్యులైన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఇలాంటి అసత్య కథనాలు ఇక ముందు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం…

 

Read more RELATED
Recommended to you

Latest news