సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి భేటీ

-

ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్నారు. కేంద్రంలోకి బీజేపీ రహిత ప్రభుత్వం రావాలనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే నినాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్‌కు మద్దతు పలుకుతున్నారు. ఓవైపు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్‌ వేస్తున్నారు.

ఇందులో భాగంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింఘ్ వాఘేలా ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చాలా సేపటి వరకు చర్చించారు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెను మార్పు తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే విషయం గురించి ఇరువురు మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news