అరేయ్ రాందేవ్ బాబా కోపం అయ్యాడ్రా  !

-

ధ‌ర‌లు ఏ విధంగా ఉన్నా మాట్లాడ‌కూడదు
మ‌ధ్య త‌ర‌గ‌తి నెత్తిన బండ ప‌డ్డా మాట్లాడ‌కూడ‌దు
పేద వ‌ర్గం, కులీన సంస్కృతి ఎలా ఉన్నా ఏ విధంగా
వేద‌న చెందినా మాట్లాడ‌కూడ‌దు కొంద‌రు ఒప్పుకోరు
ఎందుకంటే  వారంతా బీజేపీ మ‌ద్ద‌తు దారులు క‌నుక !
అని అంటోంది కాంగ్రెస్ తో స‌హా  ఇత‌ర విప‌క్షం కూడా !

పెట్రో ధ‌ర‌లు మండిపోతున్నా మాట్లాడ‌కూడ‌దు. డీజిల్ ధ‌ర‌లు మండిపోతున్నా మాట్లాడ‌కూడ‌దు. ఏం మాట్లాడినా అదంతా దేశం కోస‌మే అన్న విధంగా ఉండాలి. ధ‌ర్మం కోసం అయి ఉండాలి.ఇదే నినాదం బీజేపీ ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తోంది. జ‌నుల‌కు కావాల్సినంత జ్ఞానాన్ని ప్ర‌సాదిస్తోంది. ఇదే సంద‌ర్భంలో బీజేపీని న‌మ్ముకుని ఉండే కాషాయ ద‌ళాలు కూడా ఆ పార్టీ ఏం చెబితే అది ప‌దే ప‌దే చెబుతూ జ‌నంలోకి చొచ్చుకుపోయేందుకు ఓ స్పెక్టేటింగ్ షిప్ ను ఓన్ చేసుకుంటున్నారు.

వారంతా వాహ‌కాలు. మోడీ ఏం చెప్పినా కూడా అదే వేదం. పెట్రో రేట్లో ఎంత పెరిగినా ఏ మాత్రం మ‌నం బెంగ ప‌డ‌కూడదు అని శాంతి వ‌చ‌నాలు వ‌ల్లెవేసే ప్ర‌ధాన వాహ‌కాలు మ‌రియు మాధ్య‌మాలు వాళ్లే!తాజాగా మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌ముఖ యోగా గురువు రాం దేవ్ బాబాను విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా ఆయ‌న‌కు కోపం వ‌చ్చింది. ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో పెట్రోలు లీటరు 40 రూపాయ‌ల‌కే, గ్యాస్ బండ 300 రూపాయ‌ల‌కే అందించే ప్ర‌భుత్వాన్నే ఎన్నుకోవాల‌ని మీరే క‌దా పిలుపునిచ్చారు అని విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌నకు కోపం మామూలుగా కాదు ఓ రేంజ్ లో త‌న్నుకొచ్చింది. మీరు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ సావ‌ధానంగా స‌మాధానం చెప్పేందుకు నేనేమ‌యినా మీ కాంట్రాక్ట‌ర్ నా? మ‌ళ్లీ మ‌ళ్లీ ఇటువంటి ప్ర‌శ్న‌లు అడ‌గ‌కండి అంటూ విలేక‌రికి వార్నింగ్ ఇచ్చారు.

అవును చెప్పాను అయితే ఇప్పుడేమంటారు అని కూడా త‌న‌దైన అహంకార‌పూరిత ధోర‌ణిలో స‌మాధానాలు ఇచ్చి ఆవేశంతో ఊగిపోయారు. అయితే ఇప్పుడేం చేయ‌మంటారు మీరు అడిగిన ప్ర‌శ్న‌లన్నింటికీ  స‌మాధానం చెప్పాల్సిన అవ‌సరం త‌న‌కు లేద‌ని తేల్చేశారు. ఇదీ క‌థ‌!

Read more RELATED
Recommended to you

Latest news