కేంద్రం పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వలన దేశంలోని మొక్క జొన్న రైతాంగానికి నష్టం జరుగుతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో 3 కోట్ల 52 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న నిలువలున్నాయి ఉన్నాయని అన్నారు. కానీ దేశానికి కావలసిన మొక్క జొన్న నిలువలు 2 కోట్ల 40 మెట్రిక్ టన్నులు మాత్రమే అన్నారు. అంటే ఇప్పుడు దేశంలో కోటీ 12 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న అదనపు నిలువలున్నాయి ఉన్నాయి వ్యాఖ్యానించారు.
మొక్క జొన్నను విదేశాలకు మనం ఎగుమతి చేయాల్సింది పోయి… విదేశాల నుంచి దిగుమతికి అనుమతించింది కేంద్రం అని మండిపడ్డారు. దిగుమతి సుంకాన్ని కూడా 50 శాతం నుంచి 17 శాతానికి తగ్గించింది కేంద్రం అని ఆయన పేర్కొన్నారు. బీహార్ , ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల నుంచి 1100 రూపాయలకు క్వింటాల్ చొప్పున పౌల్ట్రీ ఫాములకు సరఫరా చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రబీ సీజన్ లో తెలంగాణ రైతాంగం మొక్క జొన్న పంట వేసి ఇబ్బంది పడవద్దు అని అన్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించడం మినహా ఒక్క పైసా ఇవ్వదు… కొనుగోలు చేయదు అని స్పష్టం చేసారు.