భారీ వర్షాలు.. పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు కీలక నిర్ణయం

-

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కాస్త ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. వాస్తవానికి శనివారం చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది.కానీ ఉదయం నుంచి వర్షం నాన్ స్టాప్‌గా పడుతుండటంతో ప్రభుత్వ కార్యక్రమాలు పోస్టుపోన్ చేసినట్లు సమాచారం.కొన్ని చోట్ల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకనిర్ణయం తీసుకున్నారు. వచ్చే 2,3 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని ప్రకారం శనివారం పెన్షన్లు అందని వారికి రేపు లేదా ఎల్లుండి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటానని సీఎం బాధితకుటుంబాలకు హామీ ఇచ్చారు. మరో రెండ్రోజులు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అలర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి సంబంధించి యంత్రాంగాన్ని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news