బిగ్ బ్రేకింగ్; ఏపీ ప్రభుత్వానికి షాక్, రంగులు తొలగించాలి…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీ రంగులు వేస్తూ వెళ్ళింది.

అదీ ఇది అనే తేడా లేకుండా జగన్ సర్కార్ రంగులతో సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో ఏపీ సర్కార్ పై పలు ఫిర్యాదులు కూడా హైకోర్ట్ దృష్టికి వచ్చాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ పలు ప్రశ్నలు కూడా సంధించింది. ఆ రంగులు పార్టీ రంగులు కాదని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పినా కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news