హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రాజకీయం రసవత్తరంగా ఉంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బరి తెగించి పనిచేస్తోంది అని విమర్శించారు. హుజూరాబాద్ లో ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. హుజూరాబాద్ లో బీజేపీకి, మందు,డబ్బుకు మధ్య యుద్ధం నడుస్తోందనన్నారు. టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. కరెన్సీ నోటుకు కమలం పువ్వుకు పోటీ జరుగుతుందని వివరించారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసింది ఏమీ లేదని విద్యార్ధులు, ఉద్యోగుల చేసిన ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఖచ్చితం బైపోల్ లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళిత బంధు బీజేపీ ఎక్కడా వ్యతిరేకించలేదు. మేము ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రజలకు ధళితబంధు ఇవ్వాలని డిమాండ్ బండి డిమాండ్ చేశారు.
హుజూరాబాద్ లో గెలిస్తే సీఎం రాజీనామ చేస్తారా..?- బండి సంజయ్
-