కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే విద్యుత్ సంస్కరణలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని మరో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి స్పష్టం చేశారు. నష్టపోయినా.. సరే విద్యుత్ సంస్కరణలను అంగీకరించమని తెల్చి చెప్పారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే.. తెలంగాణ రాష్ట్రానికి 0.5 శాతం అప్పులు నష్టం వస్తుందని అన్నారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్రానికే ఏడాదికి రూ. 5 వేల కోట్లు అప్పులు అవుతాయని అన్నారు.
దీంతో ప్రతి ఐదు ఏళ్ల కు రూ. 25 కోట్ల అప్పులు అవుతాయని అన్నారు. అలాగే దేశంలో విద్యుత్ విదానాలు సరిగ్గా లేవని అన్నారు. దేశంలో విద్యుత్ నిల్వలు అనేకం ఉన్నాయని అన్నారు. వాటిని వాడే సత్త ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సాధ్యం కాదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటును ఇవ్వడం లేదని అన్నారు. కాని ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ ఉచితంగా అందిస్తుందని అన్నారు. దీని పై చర్చకు ఏ ఒక్క బీజేపీ నాయకులు రారని అన్నారు.