తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న, మొన్న జనగాం, యాదాద్రి జిల్లాల్లో పర్యటించిన విషయం విధితమే. ఆ ప్రాంతాల్లో బహిరంగ సభలో మాట్లాడారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుధ్ధం కొనసాగుతుంది. తాజాగా ప్రగతిభవన్‌లో కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. తొలత స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు రాసిన పుస్తకాన్ని మీడియా మిత్రులందరికీ పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నారు. ప్రధాని అన్ని అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లు డ్రాప్ట్ రూపంలో పంపారు. విద్యుత్ మంత్రి దాదాపు అన్ని రాష్ట్రాలకు పంపించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేసి రైతులకు మీటర్లు వద్దు అని కేంద్రానికి పంపించామని చెప్పారు. ముఖ్యంగా మోడీ వల్ల దేశం ఎంత నాశనం అవుతుందో చాలా మంది పుస్తకాలు రాస్తున్నారని, ఇది ఒక చరిత్ర అని పేర్కొన్నారు. వ్యవసాయ మీటర్లు పెట్టాలని అనేక పాలసీలు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నారు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే దుర్మార్గం ఏమిటంటే.. 0.5 శాతం ఇస్తామని ప్రకటించడం అని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో 0.5 శాతం ఇస్తామంటే అనగా 5వేల కోట్ల పైచిలుకు అని చెప్పారు. తెలంగాణ నష్టపోయినా సరే తెలంగాణలో మీటర్లను అమర్చం అని తేల్చిచెప్పారు. పక్క రాష్ట్రం అయినటువంటి ఏపీ శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు అని చెప్పారు.