ఆ మంత్రి అవినీతి పరుడు అంటూ సిఎంకు ఎమ్మెల్యే లేఖ…!

రాజస్థాన్ కాంగ్రెస్ లో ఇంకా వేడి వేడిగానే ఉంది వాతావరణం. అక్కడి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టేలా కనపడుతున్నాయి. సచిన్ పైలెట్ శాంతించి వచ్చి ప్రభుత్వంలో పార్టీలో చేరినా సరే ఇతర నేతలు మాత్రం ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా ఒక ఎమ్మెల్యేపై మంత్రి అవినీతి ఆరోపణలు చేసాడు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భారత్ సింగ్ కుందన్‌పూర్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసారు.

ashok
ashok

అత్యంత అవినీతి పరుడు అయిన రాష్ట్ర మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. “ఈ మంత్రి అవినీతి మాఫియా అంతా ఇంతా కాదు. అతని అవినీతి హేచ్చుమీరిపోయింది. అతను పదవిని మరిచి అవినీతి చేస్తున్నాడు. నేను ఆ వ్యక్తి పేరు పెట్టడానికి ఇష్టపడను” అని లేఖలో సిఎంకు విజ్ఞప్తి చేసారు. మంత్రి ఎవరు అనేది స్థానిక మీడియా కూడా వెల్లడించలేదు.