ఇప్పటి వరకు తెలుగు తేజం ఎన్టీఆర్‌తో పోల్చుకోదగిన నాయకుడు అంటూ.. ఏపీలో ఎవరూ లేరని అం టారు. కానీ, తాజాగా శాసన మండలి రద్దు తీర్మానం చేస్తూ.. జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్. జగన్ ల వైఖరిని ప్రతి ఒక్కరూ పోల్చుకుంటున్నారు. గతంలో శాసన మండలిని రద్దు చేసిన తీరును ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. 1958, జూలై 1 ఏపీకి శాసన మండలి ఏర్పాటైంది. దీనిని అదే నెల 8న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు.
అలాంటి మండలి 1984లో రద్దయింది. అప్పటి సీఎం ఎన్టీఆర్ దీనిని రద్దు చేశారు. దీంతో అప్పుడు ఎందుకు రద్దయింది? ఇప్పుడు చేసిన రద్దుకు.. అప్పటి రద్దుకు మధ్య పోలికలు ఉన్నా యా? అని చర్చలు సాగుతున్నాయి. అప్పటి రద్దుకు, ఇప్పటి రద్దుకు విషయాలు వేర్వేరు., అయితే, కారణం మాత్రం ఒక్కటే! అప్పట్లో కాంగ్రెస్ ప్రతినిధులు మండలిలో ఎక్కువగా ఉండేవారు. ముఖ్యంగా మాజీ సీఎం రోశయ్య మండలి సబ్యుడిగా ఉండేవారు. దీంతో ఎన్టీఆర్ చేసిన బిల్లులను మండలిలో తీవ్రంగా ప్రతిఘటిం చేవారు.
రాజకీయ కారణాలతో ఈ బిల్లులను తిరస్కరించేవారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇదిలావుంటే, సభలో జరిగిన రగడను ఓ ప్రధాన పత్రిక యథాతథంగా ప్రచురించింది. `పెద్దల సభలో గలాటా` శీర్షికతో ప్రచురించింది. దీంతో సదరు పత్రికా యజమానికి మండలి చైర్మన్ నోటీసులు పంపారు. ఇది మరింత వివాదానికి కారణమైంది. దీంతో రద్దుకు దారితీసింది. ఇక్కడ కూడా తాను చేసిన బిల్లును మండలి తిరస్కరించడంపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఘటనలోనూ ఇదే జరిగింది.
విస్తృత ప్రజానీకం తనకు ఓట్లేసి అఖండ మెజారిటీ కట్టబెట్టినప్పుడు షాడో సభయిన మండలి తిరస్కరించడం, ఉద్దేశ పూర్వకంగా బిల్లును తొక్కిపెట్టడం వంటి సమస్యలు జగన్‌కు తలనొప్పిగా మారాయి. దీంతో ఆయన రద్దు కు తీర్మానం చేశారు. మొత్తానికి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనే కారణంగానే అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.