కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. చైనాలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అన్ని విధాలుగా అప్రమత్తం చేస్తుంది. పలు విమానాశ్రయాల్లో ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి పలు పరిక్షలు చేస్తున్నారు.
అయితే మన దక్షిణాది మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో చూడండి. సంక్రాంతి వెళ్ళిన మరుసటి రోజు నుంచి కూడా ఎండల తీవ్రత అనేది పెరుగుతుంది. కరోనా వైరస్ అనేది చల్లటి వాతావరణం ఉండాలి. చల్లటి గాలికి ఇది వ్యాపిస్తుంది. మనకు ఎండల తీవ్రత ఎక్కువ… దానికి తోడు వచ్చేది ఎండా కాలం కాబట్టి భయపడాల్సిన పని లేదు. రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది.
రాత్రి వేళల్లో జనాలు బయట తక్కువ తిరుగుతారు కాబట్టి వ్యాపించే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. మనకు ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి భయపడే పరిస్థితి లేదు. అయితే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి గాని జలుబు జ్వరం వచ్చిన ప్రతీ ఒక్కరు భయపడాల్సిన పని లేదు. వెంటనే మంచి ఆస్పత్రిలో సంప్రదించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.