టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోటీ షురూ.. ఎమ్మెల్సీలు అయ్యే అదృష్టం ఎవరికి దక్కెనో?

సాధారణంగా అధికార పార్టీకి ప్రత్యక్ష ఎన్నిక మాత్రమే కాకుండా పరోక్ష ఎన్నికలోనూ అడ్వాంటేజ్ ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. రాజకీయంగా ఎదగడంతో పాటు నేతలను మెయింటేన్ చేసుకుంటూ వారి సేవలను వినియోగించుకోవడం రాజకీయ పార్టీకి ముఖ్యం. ఈ క్రమంలోనే ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన వారికి నామినేటెడ్ పదవులను కట్టబెడుతుంటారు. కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీ ( Trs Party )లో ప్రస్తుతం ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కన్ఫర్మ్ చేసింది గులాబీ పార్టీ అధిష్టానం. ఇక మిగిలిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలోని నేతలు పోటీపడుతున్నారు. ప్రధానంగా 17 మంది ఎమ్మెల్సీ కావడం కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, కర్నాటి విద్యాసాగర్, తీగల కృష్ణారెడ్డి, పిట్టల రవీందర్, చకిలం అనిల్ కుమార్, టి.సంతోశ్ కుమార్, ఆకుల లలిత, సీవీరావు, జూపల్లి కృష్ణారావు, జనార్ధన్ ఇంకా పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు సమచారం.

వీరిలో కొందరికి అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్లు ప్రకటనలు చేయడం మనం పరిశీలించొచ్చు. మొత్తంగా ఎమ్మెల్సీ పదవి పొందాలని గులాబీ గూటిలో ఎమ్మెల్సీ పదవి పొందాలని చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గాల సమీకరణ, రాజకీయ లబ్ధి ఇతర విషయాలను దృష్టి పెట్టుకుని గులాబీ పార్టీ అధిష్టానం, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గులాబీ పార్టీలో సీఎం నిర్ణయమే ఫైనల్‌గా ఉంటుందనేది అందరికీ తెలిసిన సంగతే.