హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనే… వీడిన ఉత్కంఠ?

-

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. దీంతో అభ్యర్థుల వేటపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. హుజూరాబాద్‌లో బలమైన నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీఎం కేసీఆర్… కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో మరోసారి హుజూరాబాద్ అభ్యర్థిపై ఉత్కంఠ పెరిగింది. దీంతో ఈ ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను హుజూరాబాద్ నుంచి బరిలోకి దించాలని నిర్ణయించారట. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ అయితే ఈటలకు పోటీగా ఉంటుందని కేసీఆర్ భావించారట. దీంతో శ్రీనివాస్‌ను పోటీకి నిలబెట్టే అంశంపై ఇప్పటికే కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి చర్చించారట. తెలంగాణ ఉద్యమ నేతగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పేరుంది. దీంతో హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. ఈ నెల 16న ఆయన పేరు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఈ నెల 16న సీఎం కేసీఆర్ దళితబందు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటిస్తారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news