బాబు ఐటీ ఉచ్చుకు చిక్కారా… ఏం జ‌రుగుతోందంటే..!

-

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు మ‌రోసారి సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారిపోయారు. వాస్త‌వానికి ఆయ‌న నిత్యం మీడియాతో ట‌చ్‌లో ఉంటారు. అయితే, అప్పుడ‌ప్పుడు మాత్రం అన్నింటికీ భిన్నంగా ఆయ న వ్య‌వ‌హారం ఉంటుంది. గ‌తంలో ఆయ‌న అధికారంలో ఉన్న‌స‌మ‌యంలోనే ఓటుకు నోటు కేసులో ఆయ‌న పేరు వినిపించ‌డం, బ్రీఫ్‌డ్ మీ అంటూ ఆయ‌న వాయిస్ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం తెలిసిందే. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా హాట్ హాట్‌గా మారిపోయారు.

మ‌ళ్లీ చాన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బా బు చుట్టూ ఉచ్చుబిగుసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఆయ‌న‌పై వ‌స్తున్న వార్తుల కూడా ఇలాంటి సంచ‌ల‌న‌మే సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్లను రాకెట్‌గా ఏర్పాటు చేసి.. భారీ నగదు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఐటీ శాఖ కమిషనర్‌ సురభి అహ్లూవాలియా చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది.

అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపడం (ఓవర్‌ ఇన్‌వాయిసింగ్‌), బోగస్‌ బిల్లులు సృష్టించడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడిం చింది. ఇందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలను సేకరించామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐటీ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో పలు కీలక డైరీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రతీ చిన్న విషయానికి రాద్దాంతం చేసే చంద్రబాబు… ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరిగినా నోరు మెదపకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలో శ్రీనివాస్‌ తన చిట్టా విప్పేసా రేమోనన్న గుబులుతో శనివారం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన చంద్రబాబు.. రెండురోజుల ముందుగానే అక్కడికి బయల్దేరారనే ప్రచారం సాగుతోంది. పీఎస్‌ల స్థాయిలోనే రెండువేల కోట్ల అక్రమార్జన బయటపడితే అసలు పెద్దలు ఎంత నొక్కేసి ఉంటారో అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఐటీ దాడుల్లో పట్టుబడ్డ ఇన్‌ఫ్రా కంపెనీల డైరెక్టర్ల జాబితా తీస్తే పెద్దచేపల బండారం బయటపడుతుందంటూ చర్చించుకుంటున్నారు. మ‌రి ఈ కేసు మున్ముందు ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news