క‌డియం ఇంటికి భోజ‌నానినికి వెళ్లిన కేసీఆర్‌.. ఎమ్మెల్సీ ప‌క్కానా..?

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం త‌ర్వాత కేసీఆర్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌రుస‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అలాగే అనూహ్యంగా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇక నిన్న వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించిన సీఎం కేసీఆర్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రి ఇంటికి వెళ్లారు. గ‌త కొద్ది కాలంగా క‌డియంను దూరంగా ఉంచిన సీఎం అనూహ్యంగా ఆయ‌న ఇంటికి వెళ్లారు.

జిల్లా మంత్రిగా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, అలాగే ఎమ్మెల్యేల ఇండ్లును కాద‌ని ఇప్పుడు ప‌ద‌వి లేకుండా ఖాళీగా ఉన్న శ్రీహ‌రి ఇంటికి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగామారింది. మధ్యాహ్నం భోజనం కండియం ఇంట్లోనే చేశారు కేసీఆర్‌. అయితే కేసీఆర్ రాక సందర్భంగా రకరకాల వంటలతో పసందైన విందు ఏర్పాటు చేశారు మాజీమంత్రి కడియం.

ఇక త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి మ‌ళ్లీ ఇవ్వాల‌ని ఇటీవ‌ల కడియం కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ మ‌రోసారి కేసీఆర్ ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలోనే ఆయ‌న ఇవ్వ‌క‌పోతే బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం కూడా జరిగింది. అయితే వీట‌న్నింటికీ చెక్ పెడుతూ కేసీఆర్ క‌డియం ఇంటికి వెళ్ల‌డంతో మ‌రోసారి ఎమ్మెల్సీ ఖాయ‌మ‌ని తెలుస్తోంది.