ఎప్పుడు ఒకే విధంగా..ఒకే మనిషిని టార్గెట్ చేస్తే…టార్గెట్ అవుతున్న వారిపై సానుభూతి పెరుగుతుంది తప్ప..నెగిటివ్ రాదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. అటు చంద్రబాబు, ఇటు పవన్ పనికట్టుకుని జగన్‌ని విమర్శించే పనిలో ఉన్నారు. ఇక బాబు, పవన్ స్పీచ్‌ల్లో కూడా పెద్ద తేడా ఉండటం లేదు. ఇద్దరి స్పీచ్‌లు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. దీంతో వారు మాట్లాడుతున్న సబ్జెక్ట్ కంటే..ముందు జగన్‌ని టార్గెట్ చేస్తున్నారనే అంశం ఎక్కువ హైలైట్ అవుతుంది.
అసలు జగన్ వల్ల రాష్ట్రం నాశనమైందని, పథకాల పేరుతో రూపాయి ఇచ్చి, పన్నుల రూపంలో పది రూపాయిలు లాగేస్తున్నారని, బాబాయి హత్య, కోడి కత్తి డ్రామా, వాలంటీర్లు, వేల కోట్లు దోచుకున్నారని, ఎక్కడపడితే అక్కడ ప్యాలెస్‌లు కడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అలాగే మద్యం విషయం పదే పదే మాట్లాడుతున్నారు. జగన్ రేట్లు పెంచి కల్తీ మధ్యం ఇస్తున్నారని , తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకే ఇస్తామని బాబు, పవన్ చెబుతున్నారు.
ఇక ఎప్పుడు చూసిన ఇవే స్పీచ్‌లు వీటిల్లో మార్పు ఏమి లేదు. అయితే బాబు, పవన్ మాట్లాడే సబ్జెక్ట్ కంటే..వారు జగన్‌ని కావాలని టార్గెట్ చేస్తున్నారనే అంశం ఎక్కువ కనిపిస్తుంది. దీని వల్ల ప్రజలు కూడా వేరేగానే ఆలోచిస్తారు. ఎంతసేపు జగన్‌నే టార్గెట్ చేస్తున్నారనే భావన వారికి కలిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పథకాలు అందుతున్న లబ్దిదారులు ఈ అంశంపై సీరియస్ గా ఉండే ఛాన్స్ ఉంది. జగన్ అలా పథకాలు ఇచ్చి తమకు అండగా ఉంటుంటే ఇలా బాబు, పవన్ తిడుతున్నారనే భావన ఉండే ఛాన్స్ ఉంది.
కాబట్టి బాబు, పవన్..జగన్‌ని ఎంత ఎక్కువగా టార్గెట్ చేస్తే..జగన్‌కు అంత మంచిది. పైగా ఇద్దరు కలిసి పోటీ చేసి కావాలని జగన్‌ని ఓడించాలని కుట్రలు పన్నుతున్నారని భావించవచ్చు. మొత్తానికైతే బాబు-పవన్ ఎదురుదాడి చేయడం జగన్‌కే ప్లస్.