గన్‌పార్క్‌ వద్ద దీక్ష దృష్ట్యా ప్రొ.కోదండరాం ముందస్తు అరెస్టు

-

గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రూప్‌-2 పరీక్షపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలంటూ ఇవాళ.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గన్‌పార్కు వద్ద మౌనదీక్షకు సిద్ధమయ్యారు. మరోవైపు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ కూడా అమరవీరుల స్తూపం వద్ద దీక్ష చేపట్టేందుకు రెడీ అయ్యారు. నేతల పిలుపుతో వివిధ ప్రాంతాల నుంచి గ్రూప్‌-2 అభ్యర్థులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు… శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్‌ లక్డికాపూల్‌లోని బీఎస్పీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ను ఆయన నివాసం నుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు.

మరోవైపు ప్రొఫెసర్ కోదండరాంను కూడా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా ప్రభుత్వం పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవటం సరికాదని కోదండరాం సూచించారు. ఇప్పటికే పేపర్‌ లీకేజీలతో అయమోమయంలో ఉన్న వారిని…. ఒత్తిడిగి గురిచేసేలా వరుసగా పరీక్షలు నిర్వహిస్తే వారి జీవితాలు నాశనమవుతాయన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోదండరాం కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news