ఏ ఒక్క ఛాన్స్ దొరికిన దాన్ని వదలకుండా రాజకీయం చేసి..జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. జగన్‌కు చెక్ పెట్టడానికి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు కానీ అది అనుకున్న మేర బాబుకు ఉపయోగం పడటం లేదు. అయినా బాబు వెనక్కి తగ్గడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో టిడిపి గెలవడం చాలా ముఖ్యం..గెలవకపోతే ఆ పార్టీ మనుగడకే ప్రమాదం..అందుకే బాబు అధికారంలోకి రావడం కోసం ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు.
ఇప్పటికే లోకేష్‌ని పాదయాత్రకు పంపించారు. ఇటు బాబు ఎప్పటికప్పుడు జిల్లాల టూర్‌కు వెళుతున్నారు. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల టూర్‌కు వెళుతున్నారు. జగన్ హాయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదని, తమ హయాంలోనే పనులు బాగా చేశామని చెప్పడానికి..ఇప్పుడు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రాజెక్టుల పరిశీలనకు బాబు బయలుదేరారు. అలాగే ఎక్కడకక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే మొదట నందికొట్కూరులో సభ ఏర్పాటు చేసి..ఆ తర్వాత ముచ్చుమర్రి, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టులని పరిశీలిస్తారు. తర్వాత రోజు పులివెందులలో బహిరంగ సభ..ఇలా వరుసపెట్టి అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం..ఇలా శ్రీకాకుళం వరకు బాబు ప్రాజెక్టులు సందర్శిస్తూ..అదే సమయంలో పోలిటికల్ గా సభలు ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడే కార్యక్రమం చేయనున్నారు.
అయితే ఈ టూర్ వల్ల టిడిపికి మైలేజ్ పెరిగి..జగన్‌కు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే సాగునీటి ప్రాజెక్టులకు బాబు చేసిందేమి లేదు..కాబట్టి ప్రజలు బాబు పోలిటికల్ టూర్‌ని నమ్మడం కష్టమే. దీని వల్ల జగన్‌కు వచ్చే నష్టం లేదు. కానీ ప్రాజెక్టుల వద్దకు బాబుని వెళ్లకుండా వైసీపీ అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వల్ల..ఇంకా బాబుని హైలైట్ చేసినట్లు అవుతుంది. అలా జరిగితే టిడిపికే లాభం.