పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన సాలూరులో తూర్పు కాపు కొప్పుల వెలమ ఓట్లు అత్యధికం. 2004 కు ముందు వరకు టీడీపీ కంచుకోట లాంటి సాలూరు నియోజకవర్గం 2004లో టిడిపి తరఫున గెలిచిన బంజ్ దేవ్ గెలుపు చెల్లదని కోర్టు తీర్పుతో 2006లో ఎమ్మెల్యే అయిన పీడిక రాజన్న దొర సాలూరు నియోజకవర్గం లో టిడిపి పాత్రను నామమాత్రం చేశారు. 2006 నుంచి వరుసగా సాలూరులో ఎమ్మెల్యేగా గెలిచి రాజన్న తనదంటూ ప్రత్యేక ముద్ర వేశారు
రాజన్న దొరకు గిరిజనులలో ప్రత్యేక ఆదరాభిమానాలు ఉన్నాయి. రెండు సార్లు వైసీపీ తరఫున గెలిచిన రాజన్న దొరను అతనికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి రాజన్న దొరను డిప్యూటీ సీఎం చేశారు.
టిడిపికి అనుకూలంగా తూర్పు కాపు కొప్పుల వెలమ సామాజిక వర్గం వారు ఎక్కువ ఉన్నా ప్రతిపక్ష పార్టీ లో ఉన్న వర్గ పోరు వల్ల వాటిని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలో ఈసారైనా సాలూరులో రాజన్న దొరను కట్టడి చేసి టిడిపి విజయం సాధిస్తుందా లేదా వేచి చూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
తిరుగులేని నాయకత్వ లక్షణాలు ఉన్న రాజన్న దొర నియోజకవర్గ అభివృద్ధిలో కొంచెం వెనకబడి ఉన్నారని చెప్పవచ్చు ప్రభుత్వం నుండి నిధుల సేకరణలో రాజన్న వెనకబడి ఉన్నారని టిడిపి విమర్శిస్తోంది కానీ దానిని టిడిపి తనకు అనువుగా మార్చుకోవడంలో విఫలమైందనే చెప్పవచ్చు.
ఈ సారి ఎన్నికల్లో వైసీపీలో ఉన్న వర్గ పోరు తమకు అనుకూలంగా మారుతుందని టిడిపి ఆశ పడుతుంటే, రాజన్న దొర నాయకత్వానికి ఎదురేలేదని వైసిపి ధీమాగా ఉంది ,ఈసారి సాలూరు గెలుపు ఎవరిని వరిస్తుందో ఎన్నికల వరకు చూడాల్సిందే…..