ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నిజమో..ఏది అబద్దమో తెలియని పరిస్తితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అలాంటి వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ సతీమణి వైఎస్ భారతి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆమె జమ్మలమడుగు సీటులో పోటీ చేస్తారని చెప్పి ప్రచారం వస్తుంది.
అయితే ఈ ప్రచారంలో నిజమెంత ఉందో ఎవరికి క్లారిటీ లేదు. పైగా వైసీపీ వర్గాల్లో కూడా భారతి పోటీపై అసలు ఎలాంటి టాక్ లేదు. అలాంటిది ఆమె పోటీ చేస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చేశాయి. బిజినెస్ పరంగా బిజీగా ఉన్న భారతి..డైరక్ట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది లేదు. పరోక్షంగా బ్యాగ్రౌండ్ లో రాజకీయం ఏమైనా నడిపిస్తున్నారేమో గాని..డైరక్ట్ రాజకీయం చేయలేదు. ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ కోసం ప్రచారం చేసేవారు. అంతే తప్ప ఆమె పోటీపై ఎలాంటి రియాలిటీ లేదు.
అయితే జమ్మలమడుగు సీటులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డిపై కాస్త వ్యతిరేకత ఉందని, పైగా నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ టిడిపి నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే వైసీపీ గెలవడం కష్టమని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో కడప ఎంపీగా టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆది..తర్వాత బిజేపిలోకి వెళ్లారు. బిజేపి నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు కాబట్టి..ఆయన మళ్ళీ టిడిపిలోకి వచ్చి పోటీ చేస్తారని అంటున్నారు.
ఇక అక్కడ వైసీపీ తరుపున భారతి పోటీ చేస్తే సులువుగా గెలుస్తారని, అదే సుధీర్ రెడ్డి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయట. అందుకే భారతి పోటీకి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో క్లారితే లేదు.