అధికారంకోసం వెంపర్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు తప్పడం లేదు. కూటమిని కూడగట్టడానికి అడ్డదారులు తొక్కుతూ.. టికెట్ల ఖరారులో పూర్తిగా విఫలయ్యారు. గెలుపు కోసం తహతహలాడుతూ.. పొత్తులు పెట్టుకుని కొత్త చిక్కులు తెచ్చుకున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఇవ్వాలంటూ సొంత పార్టీ నేతలనే నిరాశ పరిచారు.
ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని గొప్పగా ప్రకటించుకున్న టీడీపీ నేతలకు చంద్రబాబు మొండిచెయి చూపించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ, జనసేనలకు కేటాయిండంతో.. పలు నియోజకవర్గాల్లో సీరియర్లను పక్కేనపెట్టాల్సి వచ్చింది. దీంతో మనస్థానం చెందిన నేతలు పార్టీలు వీడడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా వలసులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఇప్పటికీ 16 స్థానాల్లో సరైన వ్యక్తులు దొరక్క సతమతమవుతున్నారు. ఇప్పటికే తాము గెలవలేమని నిర్ణయించుకున్న స్థానాలు పొత్తు ధర్మమంటూ బీజేపీ, జనసేనకు అప్పగించిన ఆయన.. సొంత స్థానాలకు వచ్చేసరికి చతికిలబడుతున్నారు. వెర్వేరు సర్వేల పేరుతో నాన్చుడు ధోరణి అవలంబిస్తూ… కాలం గడిపేస్తున్నారు.
పొత్తుల ఎత్తుల్లో తలమునకలైన టీడీపీ అధినేత చంద్రబాబు.. పెండింగ్‌లో ఉన్న 16 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో చెమటోడుస్తున్నారు. పొత్తులో సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడం.. కొన్నిచోట్ల పార్టీ బలహీనంగా ఉండడంతో ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.
ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సీట్లపై మల్లగుల్లాలు పడుతున్నారు. పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం సీట్లలో టీడీపీ పోటీ చేసేవి ఏవన్న దానిపై ఇంకా సందిగ్ధం నెలకొంది. పొత్తుల్లో కేటాయించిన స్థానాల్లోనూ అభ్యర్థులు కరువవ్వడంతో ఆపసోపాలు పడుతున్నారు.