కరోనా ని మించిన డేంజర్ ఇది .. దేశానికే పెను ప్రమాదం !

-

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ని అరికట్టడానికి సరైన ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో చాలా రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు పనులన్నీ ఆగిపోవడంతో తమ స్వస్థలాలకు వెళ్లడానికి డబ్బులు మరియు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీ ప్రాంతాలలో భారీగా జనం గుమిగూడి పోయారు. వేలాది మంది వలస కార్మికులు బస్సు టెర్మినల్స్ కు చేరుకున్నారు. ఇళ్లకు వెళ్లడానికి చేసే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో వారు గుమికూడారు. Shameful, tragic: Rahul and Priyanka Gandhi on stranded migrant ...దీంతో ఏం చేయాలో తెలియక లేక  చాలా మంది తమ కాళ్లకు పని చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఢిల్లీలో డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్న రణవీర్ సింగ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ వెళ్ళటానికి రెడీ అయ్యి నడిచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో జాతీయ రహదారిపై గుండెపోటుతో మరణించాడు. ఈ విధంగానే చాలా మంది వలసదారులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి రెడీ అయ్యి కాలిబాటలు నడుస్తూ మధ్య దారిలోనే కుప్పకూలి పోతున్నారు.

 

అయితే వలస కూలీల విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని మరో పక్క డిమాండ్ వినబడుతుంది. ఇదే కనుక దేశవ్యాప్తంగా ఇంకా ఈ విధంగానే జరిగి కరోనా వైరస్ ని మించిన డేంజర్ ఇది అని…దేశానికి పెను ప్రమాదం అవుతుంది అని చాలా మంది ప్రాణాలు కోల్పోవడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో అంటున్నారు. ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షట్ డౌన్ విషయంలో…వలస కూలీల ను కూడా ఆదుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news