ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ…?

-

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సర్వం సిద్ధం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు ఆరోపణలను గట్టిగానే చేస్తున్నారనే చెప్పాలి. రాజకీయంగా తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలపడే విధంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచే విధంగా కష్టపడుతోంది.

ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. అయితే మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మహబూబ్ నగర్లో రాహుల్ గాంధీ బహిరంగ సభ పెట్టే అవకాశాలున్నాయి.

దాదాపుగా మూడు రోజుల పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా నాగార్జునసాగర్ ఎన్నికల మీద పడుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల మీద గట్టిగా ఫోకస్ చేసింది. రెండు స్థానాల్లో ఒకటి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఒక లేఖ కూడా పంపి ప్రచారానికి రావాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news