బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. చంద్రబాబుకే కాదు.. జగన్ కు కూడా దెబ్బే..!

-

బీజేపీ.. ఒక్కో పార్టీని ఘోరంగా దెబ్బతీసి.. అది కోలుకోకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే.. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీని ముందుగా టార్గెట్ చేసింది. ఏపీలో టీడీపీని భూస్థాపితం చేయాలని భారీ స్కెచ్ వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని బీభత్సమైన ప్లాన్స్ వేస్తోంది బీజేపీ. దానిలో భాగంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పార్టీలకు చెందిన నేతలకు గాలాలు వేసింది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తన పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది. కొందరు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. వాళ్లకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది. దీంతో బీజేపీ ప్రలోభాలకు ముఖ్య నేతలు కూడా లొంగిపోతున్నారు.

ఏపీ విషయానికి వస్తే… బీజేపీ స్కెచ్ లు టీడీపీకే కాదు.. వైఎస్సార్సీపీకి కూడా ఎసరు పెట్టనున్నాయి. ఎందుకంటే.. బీజేపీ టార్గెట్ ఒక పార్టీ కాదు. చంద్రబాబు కాదు.. టీడీపీ కాదు.. బీజేపీ టార్గెట్ 2024. అవును.. 2024లో ఏపీలో అధికారంలోకి రావాలి. ఆ టార్గెట్ లక్ష్యంగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది టీడీపీకి మాత్రమే నష్టం చేకూర్చదు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలకు నష్టమే. జనసేన, కాంగ్రెస్ గురించి వదిలేద్దాం. కానీ.. ముఖ్యంగా ఇటీవలే అధికారంలోకి వచ్చిన జగన్ కు మాత్రం పెద్ద ముప్పే రాబోతోంది. లేక లేక.. ముఖ్యమంత్రి అయిన జగన్.. 2024లో ఇంతకంటే భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ.. అది ఇప్పుడు బీజేపీ వల్ల సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

బీజేపీ.. ఒక్కో పార్టీని ఘోరంగా దెబ్బతీసి.. అది కోలుకోకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే.. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీని ముందుగా టార్గెట్ చేసింది. ఏపీలో టీడీపీని భూస్థాపితం చేయాలని భారీ స్కెచ్ వేసింది. చంద్రబాబును ఒంటరి చేయాలని భారీ పథకాలు రచించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను లాక్కోవడానికి భలే ఎత్తుగడలు వేసింది. ఆ ఎత్తుగడలకు వాళ్లు కూడా పడిపోయారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో 16 మంది కూడా బీజేపీలో సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పులో కీలక పాత్ర పోషించేది మాజీ మంత్రి గంటానే. అతి త్వరలోనే గంటాతో సహా.. మరో 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు. వాళ్లు బీజేపీలో చేరితే కనుక.. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయం.

మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్ర ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో తలపడటం లేదు. ప్రత్యేక హోదా కోసం కానీ.. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం కానీ.. వైఎస్ జగన్.. మోదీతో సత్సంబంధాలు నెరపాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసింది కూడా అదే. కాకపోతే చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. ప్రత్యేక హోదాపై అంతగా శ్రద్ధ పెట్టలేదు. కానీ.. జగన్ మాత్రం ప్రత్యేక హోదా ఇస్తేనే ఎన్డీఏకు మద్దతు అంటూ ప్రకటించారు.

అయితే.. ఫిరాయింపుల విషయం జగన్ తీసుకున్న నిర్ణయమే జగన్ కు ఎసరు పెట్టేలా ఉందట. వైఎస్సార్సీపీ గెలవగానే.. చాలామంది ఇతర పార్టీల నాయకులు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. కానీ.. జగన్.. ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. ఎవరినీ తన పార్టీలో చేర్చుకోలేదు. దీంతో వాళ్లు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీలో చేరడానికి సంసిద్దత వ్యక్తం చేశారు. అదే జగన్ పార్టీ కొంప ముంచబోతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

దీంతో భవిష్యత్తులో వైఎస్సార్సీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీయే కనిపించే అవకాశం ఉంది. అంతే కాదు.. బీజేపీ ఆఫర్లకు తలొగ్గి.. కొందరు వైసీపీ నేతలు కూడా బీజేపీ బాట పట్టే అవకాశాలు కూడా ఉన్నాయట. బీజీపీ అటువంటి ఆఫర్లను ప్రకటిస్తోంది మరీ. ఇప్పుడంటే కేంద్ర ప్రభుత్వం జగన్ కు సహకరిస్తోంది కానీ.. భవిష్యత్తులో సహకరిస్తుందన్న నమ్మకం లేదు. 2024 టార్గెట్ గా జగన్ లక్ష్యంగా చేసుకొని.. అన్ని పార్టీలను ఖాళీ చేసేసి… జగన్ ను ఢీకొట్టడానికి బీజేపీ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ కూడా అలాగే అనిపిస్తోంది. ఏమో.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక. చూద్దాం.. ఏపీ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో?

Read more RELATED
Recommended to you

Latest news