సమయం ఇవ్వండి.. సీబీఐ కోర్టును కోరిన జగన్

అమరావతి: సీఎం జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు జగన్ తరపు లాయర్ హాజరయ్యారు. రఘురామకృష్ణంరాజు లాయర్ వాదనలు విన్న ధర్మాసనం జగన్ వెర్సన్ ఏంటని ప్రశ్నించింది. ఇందుకు కౌంటర్ వేసేందుకు కొంత సమయంకావాలని కోరారు. దీంతో విచారణను మే 17కు వాయిదా వేసింది.

సీఎం జగన్ బెయిల్ రద్దుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. సీబీఐ విచారణ చేపట్టినప్పుడల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు అయితే తమ పరిస్థితేంటని భయాందోళనకు గురవుతున్నారు.