చిరంజీవి కోసం షర్మిలకు జగన్ అన్యాయం చేస్తారా…?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ సీట్లపైనే చర్చలు అన్నీ జరుగుతున్నాయి. రాజ్యసభ లో ఎవరిని జగన్ కూర్చోబెట్టె అవకాశం ఉందీ అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2014 లో పోటీ చేసి ఓడిపోయిన అయోధ్య రామిరెడ్డి నుంచి నిన్న పార్టీలోకి వచ్చిన బీద మస్తాన్ రావు వరకు అందరి చుట్టూనే ఈ రాజ్యసభ సీట్ల వ్యవహారం తిరుగుతుంది. పార్టీకి పెట్టుబడి పెట్టిన వాళ్ళే కాకుండా,

జగన్ కి తోడుగా నిలిచిన చాలా మంది ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వందల కోట్లు వైసీపీ కోసం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కొందరి పేర్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ షర్మిల, బీద మస్తాన్ రావు. ఈ మూడు పేర్ల చుట్టూనే ఏపీ రాజ్యసభ రాజకీయం తిరుగుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

బీద మస్తాన్ రావు ఈ మధ్య పార్టీలోకి వచ్చినా ఆర్ధికంగా అండగా నిలిచారు అనేది కొందరి టాక్. దీనితో ఆయన్ను రాజ్యసభకు పంపించడం ఖాయం అనేది ఆయన సొంత జిల్లా నెల్లూరులో వినపడుతున్న టాక్. మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపడానికి కూడా జగన్ సిద్దమయ్యారు. ఎందుకు అంటే దానికి నిమ్మగడ్డ ప్రసాద్ కారణం. సెర్బియా జైలు లో ఉన్న ఆయన బయటకు రావాలి అంటే చిరంజీవి అవసరం జగన్ కి ఉంటుంది.

ఇక షర్మిల విషయానికి వస్తే, పార్టీలో కూడా చాలా డిమాండ్లు వినపడుతున్నాయి. జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్నీ తానై అండగా నిలబడ్డారు షర్మిల. అందుకే ఆమెను రాజ్యసభకు పంపాలని జగన్ కూడా భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని భావించారు. కాని అది జరగలేదు. ఈ ముగ్గురిని పంపాలి రాజ్యసభకు. కాని ఎన్డియే తో జగన్ కి అవసరం ఉంది కాబట్టి రెండు స్థానాలు బిజెపికి ఇస్తే, వీళ్ళల్లో ఒకరు డ్రాప్ అవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news