వాళ్ళని కంట్రోల్ లో పెట్టడానికి కంకణం కట్టుకున్న జగన్ ?

465

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మొత్తం అమరావతి ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో ఆర్థికంగా బలమైన రాష్ట్రం గా రాబోయే రోజుల్లో ఎదగాలంటే కచ్చితంగా వికేంద్రీకరణ జరగాలని మూడు ప్రాంతాలలో అభివృద్ధి జరిగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరోసారి విడిపోదని చాలా బలంగా నమ్ముతున్నారు సీఎం వైఎస్ జగన్.

అయితే ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి ప్రాంతంలో తన అనుచర వర్గం తో ఎవరి ప్రాంత రైతులను రెచ్చగొట్టే విధంగా దీక్షలు ధర్నాలు చేస్తున్న చంద్రబాబుని చాలా తెలివిగా డీల్ చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నట్లు ఇందుమూలంగా తన పార్టీకి చెందిన వాళ్లు అమరావతి విషయంలో మీడియా ముందు మాట్లాడే విషయాలలో చాలా విషయాలు వరకు జాగ్రత్తగా మాట్లాడాలని తరచూ మీడియా ముందు వైసిపి పార్టీ గొంతు వినిపించే నాయకులతో జగన్ చర్చించినట్లు సమాచారం.

 

ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించి మరియు అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ని కంట్రోల్ చేయడానికి వైయస్ జగన్ చాలా తెలివిగా అమరావతి విషయంలో వ్యవహరించడానికి రెడీ అయినట్లు ఇందుమూలంగా ఈనెల 20వ తారీఖున జరగబోయే అసెంబ్లీ లో అసలు చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎందుకు పెట్టారు అన్నదానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఎల్ఈడి రూపంలో ఓ వీడియో ప్రదర్శించబోతున్నాట్లు సమాచారం.