అబ్బబ్బ ఇన్నాళ్ళకి జగన్ మెప్పు పొందే పని చేసిన రోజా ?

-

వైసిపి పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మీడియా ముందే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ కి తలనొప్పులు తెచ్చిన సంగతులు గతంలో చాలానే ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హయాంలో టిడిపి ఎమ్మెల్యేలను విమర్శించడం ఆ తరువాత ఎన్నికల ప్రచార సమయంలో రోజా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే తరుణంలో సొంత నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న సందర్భంలో మాతో మాట్లాడవచ్చు మేము దళితులం కాదు మేము స్నానాలు చేస్తాం అని ఎస్ఐ ముందు రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా రోజా మారటం జరిగింది. చాలా సందర్భాలలో రోజా ఈ విధంగానే వ్యవహరించడం జరిగింది.YCP MLA Roja Birthday Wishes To CM KCR

ఇటువంటి తరుణంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రోజా చేసిన పనికి జగన్ ఫిదా అయ్యాడట. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చాలా చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేశారు. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యే రోజా స్వయంగా సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఈ ఫైర్ బ్రాండ్.. సారు చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పూల బొకేను అందించారు.

 

ఈ సందర్భం గా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత.. ఆమె ఫోటోలు దిగారు. ఈ ఫోటోల్లో కేసీఆర్ మనమడు.. కేటీఆర్ కుమారుడైన హిమాన్షు ఉన్నారు. ఫైర్ బ్రాండ్ రోజా కు అతగాడు పెద్ద అభిమాని అట. ఈ ఫోటోలు మొత్తం చూసిన సీఎం జగన్… రోజా చాలా మంచి పని చేసింది. ఇలాంటి వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ ఉండాలని జగన్ కోరారట. దీంతో చాలామంది వైసిపి నాయకులు జగన్ చేసిన వ్యాఖ్యలు విని  అబ్బబ్బ ఇన్నాళ్ళకి జగన్ మెప్పు పొందే పని రోజా చేసినట్లు అభినందిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news